CBSE 10th, 12th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10,12వ తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. తాజాగా సీబీఎస్‌ఈ అధికారి తెలిపిన వివరాల ప్రకారం జూలై చివరి వారంలో పరీక్షలు విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే తొలుత సీబీఎస్సీ ఫలితాలను జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బోర్డ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా అధికారి తెలిపిన దాన్ని బట్టి జూలై చివరి వారంలో కచ్చితంగా ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పరీక్షలను 50 రోజులు ఆలస్యంగా ప్రారంభంకావడం వల్లే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షా ఫలితాలపై వస్తోన్న రుమర్లను విద్యార్థులు నమ్మొద్దని ఫలితాలకు సంబంధించి ఏ ప్రకటన అయినా అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకున్న తర్వాతే నిర్ధారించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే పరీక్షల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన్టుల తెలుస్తోంది. ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 34 లక్షలకుపైగా మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలవ్వగానే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbresults.nic.inలో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..