CBMR Recruitment 2022: నెలకు రూ.2,20,200ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

|

Nov 24, 2022 | 4:53 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నోకు చెందిన సెంటర్ ఆఫ్ బయో మెడికల్ రిసెర్చ్.. అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

CBMR Recruitment 2022: నెలకు రూ.2,20,200ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
CBMR Recruitment 2022
Follow us on

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నోకు చెందిన సెంటర్ ఆఫ్ బయో మెడికల్ రిసెర్చ్.. 11 అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్‌ డివైజెస్‌, డేటా సైన్సెస్, అడ్వాన్స్‌డ్ స్పెక్ట్రోస్కోపీ అండ్‌ ఇమేజింగ్, సిస్టమ్స్ బయాలజీ, బయోలాజికల్ అండ్‌ సింథటిక్ కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 40 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పే స్కేల్‌ వివరాలు..

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,67,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,59,100ల నుంచి రూ.2,20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

The Director, Centre of BioMedical Research (CBMR), SGPGIMS Campus, Raebareli Road, Lucknow-226014, Uttar Pradesh.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.