CA Exam: అప్పుడు పరీక్ష రాయని సీఏ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ప్రయోజనాలు కాపాడుతామన్న ఐసీఏఐ

|

Sep 10, 2021 | 11:23 AM

జూలైలో పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడతామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సుప్రీ కోర్టు తెలిపింది. జులై 30న న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల..

CA Exam: అప్పుడు పరీక్ష రాయని సీఏ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ప్రయోజనాలు కాపాడుతామన్న ఐసీఏఐ
Exam
Follow us on

జూలైలో పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడతామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సుప్రీ కోర్టు తెలిపింది. జులై 30న న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారికి న్యాయం చేస్తామని తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా కొందరు CA అభ్యర్థులు (చార్టర్డ్ అకౌంటెంట్) పరీక్షకు హాజరు కాలేక పోయారు. అయితే జులైలో రాయనివారికి నిర్వహించాల్సిన ప్రత్యామ్నాయ పరీక్షపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ఐసీఏఐ.. విన్నవించింది.

జులైలో హాజరుకాని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని.. వారికి ఈ ఏడాది నవంబర్‌లో పరీక్ష జరుపుతామని తెలిపింది. పాత సిలబస్‌ ప్రకారమే ఇది ఉంటుందని పేర్కొంది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పరీక్ష జరపకుండా, నవంబర్లో ఎప్పుడూ జరిగే పరీక్షతో పాటు రాయమనడం సరికాదని పేర్కొన్నారు. అయితే గత ఏడాది ఇలా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకే ఈ ఏర్పాటు చేశామని ఐసీఏఐ కోర్టుకు వివరించింది. అభ్యర్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

తాజాగా మరోసారి పరీక్ష నిర్వహించాలా..? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..? వంటి అంశాలపై కోర్టును అభ్యర్థించింది ICAI. తాజాగా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దీనిపై నివేదికను ఇనిస్టిట్యూట్‌కి సమర్పించాలని పిటిషనర్లను కోర్టు కోరింది.

ఈ నివేదికపై రెండు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్ ధర్మాసనానికి ఐసిఎఐ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలైలో జరిగిన పరీక్షకు హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశాన్ని కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇనిస్టిట్యూట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాంజీ శ్రీనివాస్ బెంచ్‌కు తెలిపారు. బెంచ్ సభ్యులుగా జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ సిటి రవికుమార్ కూడా ఉన్నారు.

పరీక్షకు హాజరుకాని వారు ఒక అవకాశాన్ని కోల్పోతారని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విన్నవించారు.

 

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..

Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..