BSF Group B Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. ఏప్రిల్‌ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

|

Apr 25, 2022 | 5:47 PM

BSF Group B Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది. బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

BSF Group B Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. ఏప్రిల్‌ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
Bsf Group B Recruitment 202
Follow us on

BSF Group B Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వచ్చింది. బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్/సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. BSF జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి అంటే 25 ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 08 జూన్ 2022 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇలా అప్లై చేయండి..

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

2. ఆ తర్వాత న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. ‘ఇక్కడ నమోదు చేయండి’పై క్లిక్ చేయండి.

3. వ్యక్తిగత సమాచారంపై క్లిక్ చేయడం ద్వారా మొత్తం సమాచారం అందించండి.

4. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి.

5. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపి అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.

పోస్టుల వారీగా అర్హత

సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్) – సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

జూనియర్ ఇంజనీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

ఇన్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్) – అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టుల కోసం అభ్యర్థి BSF అధికారిక వెబ్‌సైట్ bsf.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. వయస్సు 08 జూన్ 2022 ఆధారంగా లెక్కిస్తారు.

దరఖాస్తు రుసుము
BSF SI, JE రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 200 రుసుము చెల్లించాలి. దీనిని ఆన్‌లైన్ మార్గాల ద్వారా చెల్లించవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో పూర్తి సడలింపు ఉంటుంది.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!

Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!

Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!