Corona Virus: స్టూడెంట్స్ బీ అలెర్ట్.. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా..

|

Jan 17, 2022 | 12:14 PM

Corona Virus: కరోనా వైరస్ (Corona Virus) ప్రభావం చదువుల పైన కూడా తీవ్రంగా చూపిస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్ధులు చదువు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

Corona Virus: స్టూడెంట్స్ బీ అలెర్ట్.. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా..
Br Ambedkar University
Follow us on

Corona Virus: కరోనా వైరస్ (Corona Virus) ప్రభావం చదువుల పైన కూడా తీవ్రంగా చూపిస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్ధులు చదువు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో.. ఊపిరి పీల్చుకున్నారు.. పర్వాలేదు అనుకుంటున్న వేళ.. మళ్ళీ ఒమిక్రాన్ మన దేశంలో అడుగు పెట్టడంతో.. క్రమేపీ కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షల పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పాక్షికంగా లాక్ డౌన్ విధిస్తున్నాయి కూడా.. మరోవైపు తెలంగాణ(Telangana)లో కూడా రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. అంతేకాదు.. పలు స్కూల్, కాలేజీల్లో నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నారు.

తాజాగా డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www. braouonline.in లో చూడొచ్చని సూచించారు.

Also Read:

: వీటి మధ్య కూడా ఇంత జలసీనా.. గుర్రం, గాడిద స్నేహాన్ని తట్టుకోలేక పోయిన కుక్క..