
ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో కంపెనీ (Bookmyshow campany).. సినిమా, కన్‌సర్ట్స్, క్రీడా కార్యక్రమాలు, థియేటర్ ప్రదర్శనలు వంటి ఇతర వినోద కార్యక్రమాల కోసం టికెట్లను బుక్ చేసుకోవడానికి జనాలకు అందుబాటులో ఉండే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం. ఇది సినిమాలు, ఈవెంట్‌లు, స్ట్రీమింగ్ సేవలు, అలాగే వివిధ ప్రమోషనల్ ఆఫర్‌లను అందిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బుక్‌మైషో కంపెనీ నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ ఇస్తూ ప్రకటన వెలువరించింది. ఇందులో ట్రైనీ – లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ (యాక్టివిటీస్) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 27, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బుక్‌మైషో కంపెనీలో ట్రెయినీ – లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ (యాక్టివిటీస్) ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. అలాగే ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. ఫుల్ టైం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం మొత్తం 6 నెలల వ్యవధి వరకు ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఎంపికైన వారు ప్రతి నెలా రూ.రూ.11,250 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారితోపాటు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
బుక్‌మైషో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.