BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాల కోసం బ్యాంకు అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in లో చూడవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2021 వివరాలు, జాబ్ నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ లింక్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్ట్ పేరు – సెక్యూరిటీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య – 25
జనరల్ కేటగిరీకి – 11 పోస్టులు
OBC – 09 పోస్టులు
SC – 02 పోస్టులు
ST – 02 పోస్టులు
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EWS) – 01 పోస్ట్
పే స్కేల్..
నెలకు రూ. 48,170 నుండి నెలకు రూ. 69,810 వరకు జీతం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఇవ్వబడతాయి.
అప్లికేషన్ సమాచారం..
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ bankofindia.co.inలో దరఖాస్తు ఫారమ్ విడుదల చేయబడింది. దరఖాస్తు ప్రక్రియ 24 డిసెంబర్ 2021 నుండి ప్రారంభమైంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 07 జనవరి 2022.
దరఖాస్తు రుసుము:
జనరల్ కేటగిరీ, OBC, ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.175. ఈ ఫీజ్‌ను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ఎలా ఉంటుంది..
ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్ష లేదు. అయితే, అర్హత గల అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కనీస అర్హతలు..
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హత కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కనీసం 5 సంవత్సరాలు అధికారిగా పని చేసిన వారు కూడా అర్హులే. వయస్సు 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాల కోసం బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also read:
Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ
Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!