బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఐటీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 60 ఐటీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సీనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, జూనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్, సీనియర్ డెవలపర్, సీనియర్ యూఐ డిజైనర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంధిత విభాగంలో కనీసం 3 నుంచి 6 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్త, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులు ముంబై లేదా హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 09-11-2022ని చివరి తేదీతో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…