BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Sep 08, 2022 | 6:25 AM

BOB Recruitment: బ్యాంక్ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా పని చేసే ఈ బ్యాంకింగ్ సంస్థ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా ఎంపిక చేస్తారంటే..
Bob Jobs
Follow us on

BOB Recruitment: బ్యాంక్ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి కేంద్రంగా పని చేసే ఈ బ్యాంకింగ్ సంస్థ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ విభగాల్లో ఉన్న మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థులకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్రెడిట్ కార్డ్, ఏపీఐ, ఎస్‌డీఎల్‌సీ, ఎజైల్ వాటర్‌ఫాల్ మోడల్, ఎఫ్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌డీ, టెస్ట్ కేసెస్‌ వంటి నైపుణ్యాల్లో ప్రావీణ్యం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ముంబయిలో పనిచేయాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 15-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశల కోసం క్లిక్‌ చేయండి..