BEL Jobs: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 30 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

BEL Jobs: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
BEL Pune

Updated on: Feb 27, 2023 | 1:19 PM

పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 30 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కెమికల్/కంప్యూటర్‌ సైన్స్‌/హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లోని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 28, 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.472లు, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.177లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us