ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 80 డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంనీరింగ్/మోడర్న్ ఆఫీస్ మేనేజ్/సెక్రటేరియల్ ప్రాక్టిస్ ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఏడాది పాటు కొనసాగే అప్రెంటిస్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత ట్రేడులో డిసెంబర్ 31, 2019 నాటికి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డిసెంబర్ 31, 2022వ తేదీ నాటికి దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 23 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.