BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో 378 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Apr 07, 2022 | 8:26 AM

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను..

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో 378 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Becil Jobs
Follow us on

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ డెవలప్‌ మెంట్‌ ఆథారిటీ (DDA) ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 378 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌ (200), డేటా ఎంట్రీ ఆపరేట్‌ (178) పోస్టులు ఉన్నాయి.

* ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటఱ్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు 12వ తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిర్ణీత వేగంతో టైపింగ్ చేయగలగాలి.

* పరీక్ష ఫీజుగా జనరల్‌ అభ్యర్థులు ర. 750, ఓబీసీ రూ. 750, ఎస్‌సీ/ఎస్టీ రూ. 450, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రూ. 750, మహిళలు రూ. 750, ఎడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 25-04-2022గా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: UPSC CMS 2022: యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే..

BSNL-MTNL విలీనం వాయిదా.. కారణం ఏమిటో పార్లమెంట్‌లో తెలిపిన కేంద్ర మంత్రి..!

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..