BDL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం

|

Jun 10, 2023 | 12:36 PM

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్ (బీడీఎల్‌)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

BDL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం
BDL Jobs
Follow us on

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్ (బీడీఎల్‌)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీఎల్‌ఎస్‌ఐ డిజైనర్‌, మైక్రోవేవ్‌ డిజైనర్‌, కంప్యూటర్‌ విజన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, క్యూసీ మెకానికల్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, పీసీబీ డిజైనర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత పొందాలి.

* అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1.6 లక్షల వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-06-2023న ప్రారంభమై 16-07-2023తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..