BOI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..అప్లై చేసుకోండి ఇలా..

|

Aug 18, 2021 | 8:51 PM

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) సహాయక సిబ్బంది కోసం ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.

BOI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..అప్లై చేసుకోండి ఇలా..
Boi Recruitment 2021
Follow us on

BOI Recruitment 2021:  బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) సహాయక సిబ్బంది కోసం 21 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 ఆగస్టు 31 వరకు తమ దరఖాస్తులను పంపవచ్చు. అర్హత, జీతం గురించి వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  bankofindia.co.in లో పోస్ట్ చేసిన వివరణాత్మక ఉద్యోగ నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులను రెండు సంవత్సరాల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకుంటారు.

కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 16, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31, 2021

ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు:

దరఖాస్తుదారులు కంప్యూటర్ పరిజ్ఞానంతో BSW/ BA/ B.Com/ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయస్సు

అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు- గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ సామర్థ్యం ఉంటుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్‌ల నాణ్యత, వైఖరి, సమస్య పరిష్కార సామర్థ్యం మరియు ట్రైనీల డెవలప్‌మెంట్ విధానంతో పాటుగా ఉండే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వ్యక్తిగత ఇంటర్వ్యూ. బోధన నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రదర్శన ఉంటుంది.

“ఎంపికైన అభ్యర్థులు 2 సంవత్సరాల కాలానికి కాంటాక్ట్ ప్రాతిపదికన నియమితులు అవుతారు. ప్రస్తుతం ఉన్న పాలసీలు మరియు నిబంధనల ప్రకారం పునరుద్ధరణను బ్యాంకు స్వంత అభీష్టానుసారం పరిగణించవచ్చు. ”అని బ్యాంక్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఎలా దరఖాస్తు చేయాలి

వివరణాత్మక నోటిఫికేషన్‌తో దరఖాస్తు ఫారం వెబ్‌సైట్‌లో లభిస్తుంది – www.bankofindia.co.in – హెడ్ “కెరీర్” కింద. దానిని డౌన్ లోడ్ చేసుకుని పూర్తి చేసి.. అవసరమైన పత్రాలతో ఈ అడ్రస్ కుపంపించాలి.

దరఖాస్తులను ఈ చిరునామాకు పంపాలి: 

జోనల్ మేనేజర్

బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆగ్రా జోనల్ ఆఫీస్

1 వ అంతస్తు LIC భవనం, సంజయ్ ప్యాలెస్

ఆగ్రా -282002

విధిగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ 2021 ఆగస్టు 31 న లేదా అంతకు ముందు సాయంత్రం 4 గంటల లోపు క్లోజ్డ్ కవర్‌లో పై చిరునామాకు చేరుకోవాలి.

Also Read: Income Tax: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..155 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ.. చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.