Bank Of Baroda Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అర్హతలివే!

| Edited By: Ravi Kiran

Jan 24, 2022 | 5:43 PM

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

Bank Of Baroda Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అర్హతలివే!
Bank Of Baroda
Follow us on

Bank Of Baroda Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 220
జోనల్ సేల్స్ మేనేజర్లు (ఎంఎన్ఎంఈ వర్టికల్): 11 పోస్టులు
రీజనల్ సేల్స్ మేనేజర్లు (ట్రాక్టర్ లోన్ వర్టికల్): 9 పోస్టులు
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎన్ఎంఈ సేల్స్): 50 పోస్టులు
సీనియర్ మేనేజర్లు (ఎంఎన్ఎంఈ సేల్స్): 100 పోస్టులు
మేనేజర్ (ఎంఎన్ఎంఈ సేల్స్): 40 పోస్టులు

పే స్కేల్: అభ్యర్ధుల అర్హతలు, అనుభవం ఆధారంగా నిర్ణయించబడుతుంది.

అర్హతలు: ఏదైనా డిగ్నీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ బ్యాంకింగ్/సేల్స్/ఫోరెక్స్/మార్కెటింగ్/క్రెడిట్ అర్హతలున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: పోస్టును బట్టి 22 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్ధులను అకడమిక్ మెరిట్ ఆధారంగా
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్, ఈడబ్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.600
ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మహిళా అభ్యర్ధులకు రూ.100

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

International Day of Education 2022: అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్నిఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..