Balmer Lawrie Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాకు చెందిన బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌.. 27 మేనేజర్‌, ఆఫీసర్‌, అసిస్టెంట్ మేనేజర్‌, కస్టమర్ సర్వీస్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

Balmer Lawrie Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. అర్హతలేవంటే..
Balmer Lawrie Recruitment 2022

Updated on: Nov 13, 2022 | 8:49 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాకు చెందిన బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌.. 27 మేనేజర్‌, ఆఫీసర్‌, అసిస్టెంట్ మేనేజర్‌, కస్టమర్ సర్వీస్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సేల్స్‌, ఆపరేషన్స్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌, బ్రాంచ్‌ ఆపరేషన్స్‌-క్లైంట్‌ సర్వీసింగ్‌, మేనేజర్‌ ఆపరేషన్స్‌, రిటైల్‌ సేల్స్‌, ఆపరేషన్స్‌ యూరప్‌, కమర్షియల్‌, డొమెస్టిక్‌ ఆపరేషన్స్ తదితర తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీటెక్‌/ఎమ్ఈఎమ్/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఫ్రెషర్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 30 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానలో నవంబర్‌ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఎంపికైన వారు కోల్‌కతా, ముంబాయ్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, త్రివేండ్రంలలో పని చేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.