
ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను ఛేదించడం అంత సులువు కాదు. అందుకు కష్టపడేతత్వంతోపాటు సహనం కూడా చాలా అవసరం. ఐతే సరైన వ్యూహంతో ప్రిపేరైతే విజయం తప్పక వరిస్తుంది.

ఐతే మూడో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను క్లియర్ చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ నిర్జా షా.. ప్రిపరేషన్ టైంలో తను చేసిన ఈ మూడు పొరపాట్లను మీరు అస్సలు చేయొద్దంటూ సలహా ఇస్తున్నారు. అవేంటంటే..

చాలా మంది యూపీఎస్సీ సీఎస్‌ఈ పరీక్షలను సీరియస్‌గా తీసుకోరు. ఫస్ట్ అటెంప్ట్ సమయంలో తాను చేసిన మొదటి తప్పు ఇదేనని నిర్జా షా అంటున్నారు.

రెండోది.. మీ రిస్క్ టాలరెన్స్ లెవల్ ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకోవాలి.

ఐపీఎస్ నిర్జా షా చేసిన రెండో పొరపాటు ' ఎవరి సహాయం తీసుకోకపోవడం'

మూడో పొరపాటు.. యూపీఎస్సీకి ప్రిపేరయ్యే వారు నిరంతరం తమను ప్రేరేపించే వ్యక్తులతో ఉండాలి. ఈ పొరబాటు గ్రహించాక నా మకాం ఇంటి నుంచి ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌కు మార్చేశాననని నిర్జా షా తెలిపారు. అంటే.. సివిల్స్‌కు సిద్ధమయ్యే వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల పోటీ వాతావరణం, స్పూర్తి, వారితో కొత్తవిషయాలు చర్చించడం, సలహాలు పొందడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.