Fact Check: ఏపీలో టెన్త్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు తగ్గించారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత.?

|

Jun 07, 2022 | 12:35 PM

Fact Check: సోషల్‌ మీడియా (Social) ఎంతో శక్తివంతమైన ఆయుధం. అయితే దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అలా కాదని దుర్వినియోగపరిస్తే మొదటికే మోసం జరుగుతుంది...

Fact Check: ఏపీలో టెన్త్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు తగ్గించారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత.?
Follow us on

Fact Check: సోషల్‌ మీడియా (Social) ఎంతో శక్తివంతమైన ఆయుధం. అయితే దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అలా కాదని దుర్వినియోగపరిస్తే మొదటికే మోసం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుందని సంతోషించాలో, అబద్ధపు ప్రచారాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని బాధపడాలో తెలియని దుస్థితి వచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ కావడం నిత్యకృత్యమవుతోంది. వార్తలో నిజం ఉందా లేదా అని కూడా తెలుసుకోకుండా జనం షేర్‌లు చేస్తూనే ఉన్నారు.

దీంతో కొన్ని వ్యవస్థలు నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫేక్‌ వార్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో అదే సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పదో తరగతి పరీక్ష విషయంలో ఓ ఫేక్‌ న్యూస్‌ బాగా వైరల్‌ అయ్యింది. ‘కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న విద్యార్థులకు పరీక్షల్లో పాస్‌ మార్కులు తగ్గించారు’ అనేది సదరు వార్త సారంశం. ఏకంగా మార్క్స్‌ మెమొలను ఎడిట్ చేసి మరీ వాటిని కొందరు నెట్టింట వైరల్‌ చేశారు.

దీంతో ఈ వార్తపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ముందు ఒకటికి రెండు చూసుకోవాలని తెలుపుతూ అధికారులు ట్వీట్ చేశారు. దీంతో ఈ పుకార్లకు చెక్‌ పడినట్టైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..