డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ అండ్ స్టోర్స్ (డీపీఎస్) రీజినల్ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ /జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ, బీకాం, డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను లెవల్ – 1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్), లెవల్ – 2 పరీక్ష (డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ) ద్వారా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 10, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..