APVVP Nellore Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore)లో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 126
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్లు, థియేటర్ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్, బయోమెడికల్ ఇంజనీర్లు, పోస్టు మార్టం అసిస్టెంట్లు, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సెలర్లు, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఏ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District coordinator of Hospital Services, S.P.S.R. Nellore District, C/o. 1st floor of old Jublee Hospital, Near Vegetable Market, S.P.S.R. Nellore District.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: