AP Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ కమిషనర్ విశాఖపట్నంలోని కార్యాలయంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 124 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో థియేటర్ అసిస్టెంట్లు (18), ల్యాబ్ అటెండెంట్లు (06), ఆడియోమెట్రీషియన్ (01), పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (24), ల్యాబ్ టెక్నీషియన్లు (12), డైటీషియన్లు (02), డెంటల్ టెక్నీషియన్ (01), ఫిజియోథెరపిస్ట్ (02), బయోమెడికల్ ఇంజనీర్లు (38), ప్లంబర్ (05), ఎలక్ట్రీషియన్ (05), కౌన్సెలర్ (04) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌లో సమర్పించాలి.
* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 నుంచి రూ. 52,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 25-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!
Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పొలిటికల్ ఇష్యూలో మరో ట్విస్ట్.. ఇంతకీ ఏం జరుగబోతోంది..!