APTWREIS Admissions 2026: ఏపీ గిరిజన గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తేదీ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి ప్రవేశాలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హత కలిగిన బాలబాలికలు ఎవరైనా ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా గురుకులాల్లో..

APTWREIS Admissions 2026: ఏపీ గిరిజన గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తేదీ ఇదే
APTWREIS 5th Class Admissions

Updated on: Jan 30, 2026 | 8:41 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి ప్రవేశాలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హత కలిగిన బాలబాలికలు ఎవరైనా ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా అందిస్తారు. పూర్తి వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

5వ తరగతి ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు 2025-26 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో (GAHS) లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో 4వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షకు మించకూడదు. అభ్యర్ధుల వయోపరిమితి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2013 నుంచి ఆగస్ట్‌ 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. బీసీ, ఓసీ అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2015 నుంచి ఆగస్ట్‌ 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 28, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయింపు చేస్తారు.

ప్రతి ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు. అన్ని గురుకులాల్లోన మొత్తం సీట్లలో ఎస్టీలకు 78 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం, ఏఈక్యూలకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. రాత పరీక్ష హాల్‌ టికెట్లు మార్చి 10, 2026న విడుదల అవుతాయి. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. ఫలితాలు ఏప్రిల్‌ 29, 2026న వెల్లడిస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో 4వ తరగతి స్థాయి సిలబస్‌లో మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తెలుగులో 10 మార్కులు, ఇంగ్లిష్‌లో 10 మార్కులు, గణితంలో 15 మార్కులు, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌లో 15 మార్కుల చొప్పున అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. గ్రామీణ విద్యార్ధులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల 2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.