APSCSC Recruitment 2023: ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 875 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

|

Aug 25, 2023 | 10:08 PM

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSCSC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు 875 టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో..

APSCSC Recruitment 2023: ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 875 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
APSCSC
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSCSC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు 875 టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 2, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హలేమేమి ఉండాలంటే..

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అగ్రికల్చర్‌లో డిప్లొమా, అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/బయో టెక్నాలజీ/లైఫ్‌ సైన్సెస్‌/బీజెడ్‌సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు కంప్యూటర్‌ అప్లికేషన్‌లో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • హెల్పర్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పోస్టుల వివరాలు ఇవే..

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 275
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల సంఖ్య: 275
  • హెల్పర్‌ పోస్టుల సంఖ్య: 275

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కన్వీనర్‌ కోటాలో 16,296 బీటెక్‌ సీట్లు మిగిలిపోయాయ్‌..

తెలంగాణ ఎంసెట్‌ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసిన సీట్లలో 16,296 బీటెక్‌ సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 85,671 సీట్లు అందుబాటులో ఉండగా వీటిలో 69,375 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో మొత్తం అయిదు యూనివర్సిటీలు, 19 ప్రైవేట్‌ కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారందరూ ఆగ‌స్టు 28వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఆగస్టు 29వ తేదీ లోపు సీట్లు పొందిన కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు.