APPSC
అమరావతి, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది కూడా. డిసెంబర్ నెలలో ఏకంగా ఏడు ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 21,637 ఉద్యోగాల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించింది. వీటిల్లో డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,423 పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల అయ్యాయి. మిగిలిన పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఏపీపీఎస్సీ వెలువరించిన ఉద్యోగ ప్రకటనల వివరాలు ఇలా..
ఏయే పోస్టులలకు నోటిఫికేషన్లు వచ్చాయంటే..
- ఏపీపీఎస్సీ గ్రూప్-1 ద్వారా 81 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.
- ఏపీపీఎస్సీ గ్రూప్-2 ద్వారా 897 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.
- ఏపీపీఎస్సీ 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.
- ఏపీపీఎస్సీ 38 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి జనవరి 29 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్ 13 న ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.
- ఏపీపీఎస్సీ 21 ఏఈఈ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.
- ఏపీపీఎస్సీ 47 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.
- ఏపీపీఎస్సీ 240 డిగ్రీ లెక్చరర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్/ మేలో పరీక్ష ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.