ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు జారీ చేస్తోన్న ఏపీపీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ నంబర్ 25/2022 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్) ట్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులకు 01-07-2022 నాటికి 18 – 42 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష(పేపర్-1 & 2), కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-11-2022న ప్రారంభమవుతుండగా, 30-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పరీక్ష ఫీజు చెల్లింపునకు 04-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..