APPSC Group 2 Notification 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈసారి భారీగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాలు! నోటిఫికేషన్‌ ఎప్పుడంటే

ఏపీ సర్కార్ తాజాగా మొత్తం 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు విడతల్లో అన్ని పోస్టులను 41 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనుంది.

APPSC Group 2 Notification 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈసారి భారీగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాలు! నోటిఫికేషన్‌ ఎప్పుడంటే
APPSC Group 2 Recruitment Notification date

Updated on: Mar 27, 2026 | 11:19 AM

అమరావతి, మార్చి 27: ఏపీ సర్కార్ ఇటీవల మొత్తం 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు విడతల్లో అన్ని పోస్టులను 41 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో గ్రూప్‌ 1 పోస్టులు 91, గ్రూప్ 2కి దాదాపు 750 వరకు పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెనువెంటనే జారీ కానున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్‌లో సర్కార్ పేర్కొంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 15న విడుదలకానుంది. ఈ మేరకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది.

ఏపీ నిరుద్యోగులు నైపుణ్య పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వివరాలతోపాటు నోటిఫికేషన్‌ జారీ తేదీలు కూడా ప్రభుత్వం జారీ చేయడంతో అభ్యర్ధులు ప్రణాళిక ప్రకారం సన్నద్ధత అయ్యేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతుండగా.. మరొకొంత మంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వీటితోపాటు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో హోంశాఖలో 2,778 పోస్టులు, సంక్షేమ శాఖలో 259 పోస్టులు, అటవీ శాఖలో 140 పోస్టులు, ప్లానింగ్‌లో 268 పోస్టులు, అగ్రికల్చర్‌లో 105 పోస్టులు, పరిశ్రమలు రంగంలో 95 పోస్టులు, కార్మికశాఖలో 12 పోస్టులు, జువెనైల్‌లో 49 వరకు పోస్టులు ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీర్ పోస్టులు 503, గునుల శాఖలో 47, ఎక్సైజ్‌ శాఖలో 409, ఏఎంవీఐలో 50 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికి ఈ ఏడాది ఆగస్ట్ 15, సెప్టెంబర్ 15న వరుస నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇక డీఎస్సీలో 1,535 టీచర్‌ పోస్టులు, అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులు 1,500 వరకు ఉన్నాయి. డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్‌ అక్టోబరు 15న విడుదలకానుంది. మే 15న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

రానున్నీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. ఈ నైపుణ్య పోర్టల్‌ వివరాలు నమోదుచేస్తే జాబ్‌ క్యాలెండర్‌లోని ఉద్యోగాల ప్రకటనలతో పాటు భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం కూడా అభ్యర్థులకు అందుతుంది. ఆధార్‌ నంబరు నమోదు చేసి, సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి. అనంతరం తమ వివరాలు నమోదుచేసుకోవల్సి ఉంటుంది.

ఏపీ నైపుణ్య పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us