APPSC Group 2 Notification: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిషికేషన్.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఏస్సీ) వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనలో..
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఏస్సీ) వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఫిబ్రవరి 25వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది.
శాఖల వారీగా ఖాళీల వివరాలు..
ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 331 వరకు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి.