ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న పది రోజుల్లోగా ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ఈ రోజు (అక్టోబర్ 13వ తేదీ) నుంచి ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో గ్రూప్ 2 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఐతే ఈ నోటిఫికేషన్‌లో మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. పాత సిలబస్‌నే రానున్న గ్రూప్-2 పరీక్షలకు కొనసాగించాలని భావిస్తోంది. వాల్యుయేషన్ విధానంలో మాత్రం కొన్ని మార్పులు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు కమిషన్ అంతర్గతంగా చర్చించి ఆమోదించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పల్ప సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. దీంతో రానున్న గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.