APPSC Group 1 Exam: జనవరి 8న జరిగే ఎపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. 3 వారాల్లోనే రిజల్ట్స్‌

|

Jan 06, 2023 | 8:36 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష జ‌న‌వ‌రి 8 (ఆదివారం)న జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు..

APPSC Group 1 Exam: జనవరి 8న జరిగే ఎపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. 3 వారాల్లోనే రిజల్ట్స్‌
Appsc Group 1 Exam
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష జ‌న‌వ‌రి 8 (ఆదివారం)న జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం (జనవరి 5) ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు దాదాపు 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష అనంతరం కేవలం మూడు వారాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌లో 92 పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపే అవకాశమున్నట్లు ఆయన అన్నారు.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పగౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఏపీ సర్కార్‌ నుంచి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్‌ జారీచేస్తామన్నారు. అలాగే త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్‌ కూడా జారీ చేస్తామని’ అని గౌతమ్‌ సవాంగ్‌ తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.