
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ కింద పలు ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవగా.. నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్ 3, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం ఉండబోదని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పోస్టుల వివరాలను మరోసారి పరిశీలిద్దాం..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏపీఎంసీలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఈ రోజు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు జీతంగా రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.