APIIC Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఏపీలోని ఇండస్ట్రీయల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఆధ్వర్యంలోని కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్.. కంపెనీ సెక్రటరీ (Company Secretary Posts)..
APIIC Company Secretary Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఆధ్వర్యంలోని కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్.. కంపెనీ సెక్రటరీ (Company Secretary Posts), మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
విభాగాలు: హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్, మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
పోస్టుల వివరాలు:
- కంపెనీ సెక్రటరీ పోస్టులు: 1
- మేనేజర్ పోస్టులు: 2
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 1
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్, ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్ ఐడీ: admindept@kriscity.in
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022 (సాయంత్రం 5 గంటలలోపు)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: