AP TET 2024 Answer Key: ఏపీ టెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. వెబ్‌సైట్లో రెస్పాన్స్‌షీట్లు! అక్టోబర్‌ 18 వరకు అభ్యంతరాల స్వీకరణ

|

Oct 16, 2024 | 3:11 PM

ఆంధ్రప్రదేశ్ టెట్ ఆన్సర్ కీలను విద్యాశాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని పరీకల ఆన్సర్ కీలను సబ్జెక్ట్ వైజ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. వీటిపై అక్టోబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఫలితాలు వెలువడేది ఎప్పుడంటే..

AP TET 2024 Answer Key: ఏపీ టెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. వెబ్‌సైట్లో రెస్పాన్స్‌షీట్లు! అక్టోబర్‌ 18 వరకు అభ్యంతరాల స్వీకరణ
AP TET 2024 Answer Key
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి. టెట్ (జులై) 2024 పరీక్షలు ముగిసిన మరుసటి రోజే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలవుతున్నాయి. ఈ మేరకు అక్టోబర్‌ 3 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పేపర్‌ 1ఎ, 1బి పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని సూచించింది. ఇక మిగిలిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ‘కీ’లు కూడా పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల కానున్నాయి. టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం సెషన్‌ పరీక్ష 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్‌ పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.

ఏపీ టెట్‌ 2024 (జులై) ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ టెట్‌ 2024 (జులై) రెస్పాన్స్‌ షీట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. ఇక టెట్‌ పరీక్షలు ముగిసిన తర్వాత అక్టోబర్‌ 27న తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 2న టెట్‌ ఫలితాల ప్రకటన ఉంటుంది. టెట్‌ ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత అంటే నవంబర్‌ 3వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది.

కాగా మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్‌కు పోటీపడే వారి సంఖ్య ఈ సారి భారీగానే పెరిగింది. అందుకే ఎన్నడూలేనిది దాదాపు నాలుగున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 108 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 95 కేంద్రాలు, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంల్లో మరో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో 24,396 మంది పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.