School Bag: బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు!

|

Jan 16, 2025 | 3:12 PM

స్కూల్ విద్యార్దులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పసి ప్రాయంలో వీపులపై బండెడు బరువుతో బ్యాగులు మోత నుంచి ఉపశమనం కలగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మేరకు పుస్తకాల బరువు భారీగా తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్ వారీగా అన్నీ సబ్జెక్టులకు కలిపి ఒకే బుక్ తీసువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది..

School Bag: బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు!
School Bag
Follow us on

అమరావతి, జనవరి 16: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్‌ విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నూతన ప్రణాళికలు రూపొందిస్తుంది. సెమిస్టర్ల వారీగా అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యంగా ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్‌కు అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంలో ఇవ్వనున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్‌ వస్తుంది. ఇక రెండో సెమిస్టర్‌లో కూడా అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి కూడా వర్క్‌బుక్‌ ఉంటుంది. ఈ మేరకు ఇటీవల ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్న ప్రకటించింది. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించింది.

  • పాఠశాలల్లో చదివే 3 నుంచి 5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాషా సబ్జెక్టులు అన్నింటికీ కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్ వస్తుంది. ఇక ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్‌ తీసుకువస్తారు.
  • 9, 10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ని తొలగించి, గతంలో రద్దు చేసిన రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని మళ్లీ తీసుకొస్తారు.
  • ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లు అనుమతి లేకుండా గైర్హాజరైతే ఉపాధ్యాయుల బదిలీల సమయంలో నెలకో పాయింట్‌ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్‌ పాయింట్లు ఇస్తారు. ఇది బదిలీ ప్రక్రియపై కీలకంగా ప్రభావితం చేస్తుంది.
  • సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 94 వేల మంది ఉపాధ్యాయులు తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకున్నారు.
  • ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్ల వారీగా బదీలో ప్రాధాన్యత ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.