AP Police SI Physical Events Dates 2023: ఏపీ ఎస్సై దేహదారుఢ్య పరీక్షల తేదీల్లో స్వల్పమార్పు..! కారణం ఇదే..

|

Aug 25, 2023 | 9:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నేటి (ఆగస్టు 25) నుంచి విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు నాలుగు కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ ప్రారంభం కావల్సి ఉంది. అయితే గుంటూరులో మాత్రం వర్షాల కారణంగా నేడు జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్‌ వాయిదా పడ్డాయి. మిగతా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి గుంటూరు పరిధిలో యథాతథంగా..

AP Police SI Physical Events Dates 2023: ఏపీ ఎస్సై దేహదారుఢ్య పరీక్షల తేదీల్లో స్వల్పమార్పు..! కారణం ఇదే..
AP SI Physical Events
Follow us on

అమరావతి, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్‌ ఆగస్టు 25 (శుక్రవారం) నుంచి ప్రారంభంకావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రిత్యా వాయిదా వేసినట్లు ఐజీ పాల్‌రాజు వెల్లడించారు. తాజాగా కురుస్తోన్న వర్షాల కారణంగా గుంటూరు రేంజ్‌ పరిధిలో మైదానం సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 25న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని సెప్టెంబరు 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. మిగతా తేదీల్లో జరగాల్సిన ఈవెంట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్‌కి సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ తమ హాల్‌టికెట్లతో ఫిజికల్ ఈవెంట్స్‌కి హాజరుకావల్సిందిగా సూచించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నేటి (ఆగస్టు 25) నుంచి విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు నాలుగు కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ ప్రారంభం కావల్సి ఉంది. అయితే గుంటూరులో మాత్రం వర్షాల కారణంగా నేడు జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్‌ వాయిదా పడ్డాయి. మిగతా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి గుంటూరు పరిధిలో యథాతథంగా జరుగుతాయి. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ) ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్‌ 2 అప్లికేషన్‌ ఫాం తెచ్చుకోవాలని ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించింది. మొత్తం 411 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులు, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులకు సంబంధించి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రిలిమినరీ రాతపరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుగాకా 57,923 మంది ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు పురుష అభ్యర్ధులు 49,386 మంది, మహిళా అభ్యర్ధులు 8537 మంది హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.