AP PGECET Results 2021: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 (AP PGECET) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. దీంతోపాటు ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP PGECET 2021 ఫలితాలు సెప్టెంబర్ 27 నుంచి 29, అక్టోబర్ 8న జరిగిన పరీక్షలకు సంబంధించినవని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రిలిమినరీలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మరలా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యా మండలి తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక జవాబు కీని అక్టోబర్ 2న విడుదల చేశారు.
అభ్యర్థులు ఫలితాన్ని తనిఖీ చేయడానికి, ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in ని సందర్శించాలి. ఫలితాన్ని తెలుసుకోవడానికి, ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ అవసరం.
AP PGECET 2021 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – sche.ap.gov.in లేదా మనబడి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో ‘ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయండి’ లేదా ‘ఫలితాలు’ అనే లింక్‌లలో ఏదైనా క్లిక్ చేయాలి.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
అనంతరం AP PGECET ఫలితాలు, ర్యాంక్ కార్డ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
వీటిని వీడివిడిగా చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫలితాలలో మెరిట్ సాధించిన అభ్యర్థులు.. కౌన్సెలింగ్‌లో కొనసాగవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు ఇదే చివరి దశ ప్రక్రియ కానుంది.
Also Read: