AP Inter Results 2026: ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో

AP Inter Supplementary Results 2026: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 18)విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి లోకేష్ ఈ మేరకు సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా మార్కుల లిస్ట్ చెక్ చేసుకోండి..

AP Inter Results 2026: ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో
AP Intermediate Supplementary Results

Updated on: Jun 18, 2026 | 1:13 PM

అమరావతి, జూన్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్‌ 18) విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మేరకు సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు రాసిన సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 59 శాతం మంది, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విజయం సాధించిన విద్యార్ధులకు, అలాగే మార్కులు మెరుగుపరుచుకున్న విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 కు ‘Hi’ అని మెసెజ్‌ చేసి ఫలితాలు చిటికెలో పొందవచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా మే 21 నుంచి జూన్‌ 4 వరకు జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు ఈ రోజు విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ జనరల్‌, ఒకేషనల్‌ సప్లిమెంటరీతో పాటు ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. కాబట్టి ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయినట్లే. వచ్చే మూడు రోజుల తర్వాత అంటే జూన్‌ 22వ తేదీన ఈఏపీసెట్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది కూడా. ఆ వెనువెంటనే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా ప్రారంభిస్తారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us