Intermediate betterment exams: ఆంధ్రప్రదేశ్‌లో నేటినుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కనీస మార్కులతో విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసినప్పటికీ మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు మరో అవకాశం కల్పించింది. బెటర్‌మెంట్ రాసి ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు, మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు నిత్యం మంచి నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు కరోనా నిబంధనలతో పరీక్షలు జరగనున్నాయి.
ఇదిలాఉంటే.. ఇంటర్ పరీక్షల నిర్వహణపై వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పరీక్షలు ఎందుకు నిర్వహించకూడదో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ పిటిషనర్‌కు సూచించింది. మార్కులను పెంచుకునేందుకు విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చని.. ఈ పరీక్షల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం పేర్కొంది. పిటిషనర్ వాదనను విన్న హైకోర్టు.. పరీక్షలపై రాతాపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. దీంతోపాటు దీనిపై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
Also Read: