Andhra Pradesh: ఏపీలో రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు.. 38 వేల ఉద్యోగాలు.. దావోస్‌ టూర్‌ వివరాలు ఇవే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు రానున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌ తెలిపారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దావోస్‌ టూర్‌కు సంబంధించిన పలు వివరాలను మంత్రి...

Andhra Pradesh: ఏపీలో రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు.. 38 వేల ఉద్యోగాలు.. దావోస్‌ టూర్‌ వివరాలు ఇవే..
Andhra Pradesh

Updated on: May 31, 2022 | 5:15 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు రానున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌ నాథ్ తెలిపారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దావోస్‌ టూర్‌కు సంబంధించిన పలు వివరాలను మంత్రి మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అదానీ, అంబానీ, గ్రీన్‌కోలతో ఎమ్‌ఓయూ చేసుకోవడం అంతదూరం వెళ్లాలా అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కానీ వాళ్లకు ఏపీపై అవగాహన ఉండడంతోనే ఒప్పందాలు జరిగాయి. దావోస్‌ జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పలు పారిశ్రామిక దిగ్గజాలకు ఏపీలో ఉన్న అవకాశాలపై సమర్థవంతంగా వివరించాం’అని చెప్పుకొచ్చారు.

ఇక దావోస్‌ వేదికగా జరిగిన పలు ఒప్పందాల గురించి మంత్రి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి 50 మంది ప్రపంచస్థాయి ప్రతినిధులతో సమావేశం అయ్యారు. డీ కార్బనైజెడ్ ఎకానమీ కోసం గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకత పెంపుపై విస్తృత సమావేశం జరిగింది. విశాఖలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరాం, దానికి సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఐటీ, పోర్ట్ రంగాలలో విస్తృత అవకాశాలున్న విశాఖ అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించాం. ఏపీలో పరిశ్రమల కోసం లక్ష ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని దావోస్‌ వేదికగా తెలిపాము. ఏపీలో రానున్న రోజుల్లో రూ. లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి, దీనిద్వారా 38 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. డీ కార్బనైజెడ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ని పైలట్‌గా చేయాలని నిర్ణయించుకున్నాం’ అని మంత్రి తెలిపారు.

కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు..

విశాఖపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. దావోస్‌లో సమావేశమైన అన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదాక వెంటపడుతామని తెలిపారు మంత్రి. ఇక దావోస్‌లో కొందరు ప్రతినిధులు ‘విశాఖ మునిగిపోతుందట కదా’ అనిడాగరని, కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాన్ని తమ అనుకూల మీడియా ద్వారా చేశారని మంత్రి తెలిపారు. ఒక ప్రాంతం ఇమేజ్‌ని ఉద్దేశపూర్వకంగా పాడుచేయద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..