AP Govt Jobs 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! ఏపీ వైద్యారోగ్య శాఖలో 2051 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..

|

Aug 15, 2022 | 7:06 AM

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 2051 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-II, ఫార్మసిస్ట్ గ్రేడ్‌-II, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల..

AP Govt Jobs 2022: నిరుద్యోగులకు బంపరాఫర్‌! ఏపీ వైద్యారోగ్య శాఖలో 2051 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..
Ap Hmfw Jobs
Follow us on

AP HMFW Staff Nurse Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 2051 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-II, ఫార్మసిస్ట్ గ్రేడ్‌-II, ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, డీఎమ్‌ఎల్టీ, డిప్లొమా ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 20, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చూడొచ్చు.

జిల్లాలవారీగా ఖాళీల వివరాలు:

  • అనంతపురం: 171
  • చిత్తూరు: 162
  • తూర్పు గోదావరి: 322
  • గుంటూరు: 132
  • కృష్ణ: 296
  • కర్నూలు: 129
  • ప్రకాశం: 166
  • SPSR నెల్లూరు: 10
  • శ్రీకాకుళం: 144
  • విజయనగరం: 194
  • పశ్చిమ గోదావరి: 237
  • వైఎస్ఆర్ కడప: 88

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.