ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అమరావతిలోని హైకోర్టులో ఉన్న ఖాళీల భర్తీకి ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు, బదిలీల ద్వారా 6 ఖాళీలు భర్తీ కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-11-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు 08-12-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..