విద్యార్ధులకు అలర్ట్.. AP EAPCET 2026 ఫలితాలు వచ్చేశాయ్! దుమ్ములేపిన అబ్బాయిలు

AP EAPCET 2026 Top Rankers: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో 70.52 శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు..

విద్యార్ధులకు అలర్ట్.. AP EAPCET 2026 ఫలితాలు వచ్చేశాయ్! దుమ్ములేపిన అబ్బాయిలు
AP EAPCET Results

Updated on: Jul 01, 2026 | 5:54 PM

అమరావతి, జులై 1: ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో 70.52 శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2,76,572 మంది విద్యార్ధులు ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది అంటే 70.52 శాతం మంది క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. ఇక అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 70,929 మంది పరీక్ష రాశారు. వీరిలో 63,546 మంది అంటే 89.59 శాతం మంది క్వాలిఫై అయినట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. తాజా ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి టాప్ ర్యాంకు సాధించాడు.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాపర్లు..

  • 1st ర్యాంక్‌ జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి (గుంటూర)
  • 2nd ర్యాంక్‌ కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం)
  • 3rd ర్యాంక్‌ వెన్న ప్రవీణ్‌ కుమార్ రెడ్డి (పల్నాడు)
  • 4th ర్యాంక్‌ తుంగ దుర్గా సుప్రభాత్‌ (పల్నాడు)
  • 5th ర్యాంక్‌ తెల్లూరి శ్రేయస్‌ రెడ్డి (హైదరాబాద్‌)

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా స్ట్రీమ్‌లో టాపర్లు వీరే

  • 1st ర్యాంక్‌ శంబంగి జశ్వంత్‌ నాయుడు (విజయనగరం)
  • 2nd ర్యాంక్‌ కుడుముల వెంకట మహంత్‌ అక్షజ్‌ రెడ్డి (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి)
  • 3rd ర్యాంక్‌ కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా)
  • 4th ర్యాంక్‌ కర్రి సత్యనారాయణ (కాకినాడ)
  • 5th ర్యాంక్‌ బంటు ధాత్రిక (అనకాపల్లి)
Follow Us