మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. ఇంజినీరింగ్ ప్రవేశాలకు రంగం సిద్ధం

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్-2026 ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత కౌన్సెలింగ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు జులై 20 నుంచి 29 వరకు అవకాశం ఉండగా, ధ్రువపత్రాల పరిశీలన జులై 22 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు..

మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. ఇంజినీరింగ్ ప్రవేశాలకు రంగం సిద్ధం
AP EAPCET Counselling

Updated on: Jul 17, 2026 | 12:25 PM

అమరావతి, జులై 17: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌-2026 తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్య కమిషనరేట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జులై 16న విడుదల చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు జులై 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం జులై 22 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కాలేజీలు, బ్రాంచిల ఎంపిక కోసం వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు జులై 25 నుంచి 31 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే నమోదు చేసిన ఐచ్ఛికాల్లో మార్పులు చేసుకునేందుకు ఆగస్టు 1న ప్రత్యేక అవకాశం ఇవ్వనున్నారు.

అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 6న నిర్వహించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7 నుంచి 13వ తేదీ మధ్య ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు ఇవే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జులై 16, 2026.
  • రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు తేదీలు: జులై 20 నుంచి 29 వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన: జులై 22 నుంచి 31 వరకు
  • వెబ్ ఆప్షన్లు నమోదు: జులై 25 నుంచి 31 వరకు
  • వెబ్ ఆప్షన్ల మార్పు: ఆగస్టు 1, 2026.
  • తొలి విడత సీట్ల కేటాయింపు: ఆగస్టు 6, 2026.
  • కాలేజీల్లో చేరిక: ఆగస్టు 7 నుంచి 13 వరకు
  • తరగతుల ప్రారంభం: ఆగస్టు 10 నుంచి
Loading...
Unable to load recommendations.
Follow Us