AP EAMCET Results 2021: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..

|

Sep 08, 2021 | 11:00 AM

AP EAPCET Results 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా శాఖ మంత్రి

AP EAMCET Results 2021: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..
AP EAMCET 2021 result
Follow us on

AP EAPCET Results 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేశారు. కాగా.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఈ కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.

ఫలితాలను తెలుసుకునేందుకు నేరుగా ఈ కింద ఇచ్చిన లింకుల్లో ఏదోఒకటి క్లిక్‌ చేయండి.

https://sche.ap.gov.in/APSCHEHome.aspx
https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx

లింకును క్లిక్ చేసిన అనంతరం AP EAMCET 2021 ఫలితంపై క్లిక్ చేయండి
రిజిస్టర్‌ నంబర్, వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేయాలి
అనంతరం AP EAMCET ఫలితం కనిపిస్తుంది.
ఆ తర్వాత రిజల్ట్స్‌ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

కాగా.. ఈ పరీక్షలకు మొత్తం 1.76 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా.. కోవిడ్‌ నిబంధనలతో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు.

Also Read:

Horoscope Today: ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. బుధవారం రాశిఫలాలు..

Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..