AP DSC 2024 Revised Schedule: ఏపీ డీఎస్సీ 2024 కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్షంటే..

|

Mar 12, 2024 | 5:01 PM

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-డీఎస్సీ) 2024 వాయిదా పడింది. టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్య కనీసం 4 వారాల గడువు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ డీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. ఇప్పటికే డీఎస్సీ (AP DSC) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మంగళవారం (మార్చి 12) పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం..

AP DSC 2024 Revised Schedule: ఏపీ డీఎస్సీ 2024 కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్షంటే..
AP DSC 2024 Revised Schedule
Follow us on

అమరావతి, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-డీఎస్సీ) 2024 వాయిదా పడింది. టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్య కనీసం 4 వారాల గడువు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ డీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. ఇప్పటికే డీఎస్సీ (AP DSC) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మంగళవారం (మార్చి 12) పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకావల్సి ఉంది. కానీ హైకోర్టు జోక్యంతో పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌ టేబుల్‌ను రూపొందించారు. డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఆయా పోస్టుల వారీగా కొత్త డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌- 2024 తేదీల వారీగా ఇలా..

  • మార్చి 20వ తేదీన పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్ధులు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి.
  • మార్చి 25వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు పరీక్షలు జరుగుతాయి
  • ఏప్రిల్‌ 7న ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష జరుగుతుంది
  • ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి

AP DSC Schedule

కాగా మొత్తం 6,100 టీచర్‌ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. వాటిల్లో కొన్ని జిల్లాల్లో సున్నా పోస్టులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఐదేళ్లుగా డీఎస్సీ పరీక్షల కోసం ఎదురు చూస్తుంటే తమ జిల్లాల్లో సున్నా పోస్టులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇక ఈ రోజు విడుదల చేసిన కొత్త డీఎస్సీ షెడ్యూల్‌ కూడా నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. ఏప్రిల్ 28న ఏపీ సెట్‌ పరీక్ష, ఏప్రిల్ 13న ఏపీపీఎస్సీ డిప్యూటీ డీఈవో స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి. సరిగ్గా ఇవే తేదీల్లో అంటే ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు డీఎస్సీతో పాటు డిప్యూటీ డీఈవో, ఏపీ సెట్‌కు సిద్ధమవుతున్నారు. డీఎస్సీ పరీక్షల తేదీల్లో ఇతర పరీక్షలు కూడా ఉండటంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.