AP Govt Jobs 2024: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

|

May 09, 2024 | 4:25 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఫేజ్‌ 2 స్పెషాలిటీస్‌ విభాగంలో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి AP Medical Services Recruitment Board నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 17వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషాలిటీలో..

AP Govt Jobs 2024: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
AP DME Recruitment 2024
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఫేజ్‌ 2 స్పెషాలిటీస్‌ విభాగంలో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి AP Medical Services Recruitment Board నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 17వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషాలిటీలో ఎం.డి, పీహెచ్‌డీతో పాటు ఐదేళ్ల బోధనా అనుభవం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. మే 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 17వ తేదీలోపు దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి 2024-25 ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. జులై- ఆగస్టు నెలలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌), హవల్దార్ (గ్రూప్‌-సి నాన్‌-గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది 1,558 ఖాళీలు భర్తీ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో త్వరలో కమిషన్‌ వెల్లడిస్తుంది. సెషన్-1, 2 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.