
అమరావతి, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) రాత పరీక్షలు డిసెంబరు 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రటకనలో తెలిపారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సారి టెట్‌కు మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (SLPRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 1520 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు పేపర్ 1 (అబ్జెక్టివ్) జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్లను డిసెంబర్ 5 నుంచి 8 వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇక పేపర్ 2 (డిస్క్రిప్టివ్) రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.