AP TET 2024 Answer Key: నేటితో ముగిసిన టెట్‌ ఆన్‌లైన్ పరీక్షలు.. వెబ్‌సైట్లో ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

|

Oct 21, 2024 | 6:09 PM

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షల ఆన్సర్ కీలు విడుదలయ్యాయి. అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీతో ముగిశాయి. తుది ఆన్సర్ మరో వారంలో విడుదల చేస్తారు..

AP TET 2024 Answer Key: నేటితో ముగిసిన టెట్‌ ఆన్‌లైన్ పరీక్షలు.. వెబ్‌సైట్లో ప్రిలిమినరీ కీ విడుదల
AP TET 2024 Answer Key
Follow us on

అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 పరీక్షలు నేటితో ముగిశాయి. ఇప్పటి వరకు పూర్తైన అన్ని సబ్జెక్ట్‌ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లతోపాటు రెస్పాన్స్‌ షీట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిసింది. అక్టోబర్‌ 3వ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీతో ముగిశాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ఆయా సబ్జెక్ట్‌ పరీక్షల ప్రశ్నాపత్రం, ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇక ఆన్సర్‌ కీలపై అభ్యంతరాల స్వీకరణ కూడా చేపట్టారు. పేపర్‌ 2ఎ మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 21వ తేదీతో ముగియనున్నాయి. ఈ రోజు జరిగిన పరీక్షకు మరో 5 రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించిన టెట్‌ పరీక్షల తుది ఆన్సర్‌ కీ అక్టోబర్‌ 27వ తేదీన విడుదల అవుతుంది. నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటిస్తారు. టెట్‌ ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజే అంటే నవంబర్‌ 3వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

గెస్ట్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నం మున్సిపాలిటీలో ఉన్న తగరపువలస ప్రభుత్వ గెస్ట్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి శ్రీనివాసులు ప్రకటన వెలువరించారు. ఇంగ్లిషు, కంప్యూటరు, హిస్టరీ, వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్‌ల కోసం ప్రకటన విడుదల చేశారు. ఆయా సబ్జెక్టుల్లో 55 శాతం ఆపై మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే ఏపీ సెట్ లేదా యూజీసీ నెట్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. బోధనానుభవం, కంప్యూటరు పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. చిట్టివలస హైస్కూలు సమీప కళాశాల ప్రాంగణంలో అక్టోబర్‌ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంగ్లిష్, హిస్టరీలకు, 25వ తేదీ కంప్యూటర్ సైన్సు, వృక్ష, జంతుశాస్త్రాల సబ్జెక్టుల వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇతర వివరాలకు 89788 83125 నంబరుకు ఫోనులో సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.