AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Schedule: ఏపీ టెట్ 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే.. హాల్ టికెట్లలో తప్పులు ఇలా సవరించుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తగా అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 19 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. అక్టోబరు 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించనున్నారు...

AP TET 2024 Schedule: ఏపీ టెట్ 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే.. హాల్ టికెట్లలో తప్పులు ఇలా సవరించుకోండి
AP TET 2024 Schedule
Srilakshmi C
|

Updated on: Sep 24, 2024 | 3:21 PM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తగా అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 19 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న టెట్‌ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. అక్టోబరు 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. రోజుకు రెండు విడతల చొప్పును ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అలాగే టెట్‌ హాల్‌ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్‌ రోల్స్‌ సరి చేయించుకోవచ్చని తెలిపారు. ఇందుకు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు. ఇతర సందేహాలు ఉంటే డైరెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 ఫోన్‌ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

ఏపీ టెట్ 2024 పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • అక్టోబరు 3 నుంచి 5 వరకు రెండు సెషన్స్‌లోనూ పేపర్‌ 2ఏ తెలుగు, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, సంస్కృతం ల్యాంగ్వేజ్‌ పండిట్‌ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 6న ఎస్‌జీటీ పేపర్‌ 1ఏ, ఏబీ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 7 నుంచి 10 వరకు రెండు సెషన్‌లలోనూ ఎస్జీటీ పేపర్‌-1ఏ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 13న ఉదయం ఎస్జీటీ పేపర్‌ 1ఏ, మధ్యాహ్నం నుంచి ఎస్జీటీ పేపర్‌ 1 తెలుగు, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 14న ఉదయం ఎస్జీటీ పేపర్‌ 1ఏ తెలుగు, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ గణితం, సామాన్య శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 15, 16లలో ఉదయం పేపర్‌-2ఏ గణితం, సైన్సు.. అక్టోబర్‌ 16న రెండో సెషన్‌లో పేపర్‌ 2ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడం, ఒడియా, తమిళం, ఆంగ్లం పరీక్షలు ఉంటాయి.
  • అక్టోబర్‌ 17, 18, 19 తేదీల్లో గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్‌ 20న పేపర్‌ 2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఆంగ్లం ఉండగా రెండో సెషన్‌లో సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు.
  • అక్టోబర్‌ 21న పేపర్‌ 2ఏ సాంఘిక శాస్త్రం నిర్వహించగా.. రెండో సెషన్‌లో పేపర్‌ 2బీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుంది.

కాగా టెట్‌ పరీక్షకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలోఇతర రాష్ట్రాల్లో సుమారు 24,396 మంది పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులందరూ తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే