Andhra Pradesh: ఇంజినీరింగ్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచే..

| Edited By: Narender Vaitla

Nov 05, 2023 | 7:18 AM

ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇదిలా ఉంటే.. సాధారణంగా ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు అడ్మిషన్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది...

Andhra Pradesh: ఇంజినీరింగ్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచే..
Representative Image
Follow us on

ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియకు సాంకేతిక విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ ఆరో తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇదిలా ఉంటే.. సాధారణంగా ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు అడ్మిషన్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొదటి, రెండో దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్‌కు అర్హత ఉంది. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో అప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు. విద్యార్ధుల నుంచి వచ్చిన అభ్యర్థనతో స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రత్యేక దశ అడ్మిషన్లకు ప్రభుత్వ పథకాల వర్తింపు..

ప్రత్యేక దశ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలలోని బీఈ, బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు అడ్మిషన్లు చేయనున్నారు. ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబరు 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్ ల నమోదుకు అవకాశం ఇచ్చారు. నవంబరు 8వ తేదీ ఆప్షన్ల మార్పునకు అనుమతి ఉంటుంది. నవంబరు 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 11 నుంచి 13 వరకు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..