Free Internships 2025: విద్యార్థులకు బలే ఛాన్స్‌.. AICTE ఉచిత ఇంటర్న్‌షిప్‌లు వచ్చేశాయ్‌! ఎంపికై నెలకు రూ.25 వేలు స్టైఫండ్‌

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)తో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఇంటర్న్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 18, 2025వ తేదీ లోపు సంబంధిత పోర్టల్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

Free Internships 2025: విద్యార్థులకు బలే ఛాన్స్‌.. AICTE ఉచిత ఇంటర్న్‌షిప్‌లు వచ్చేశాయ్‌! ఎంపికై నెలకు రూ.25 వేలు స్టైఫండ్‌
Free Internships to students

Updated on: May 10, 2025 | 3:00 PM

అమరావతి, మే 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)తో కలిసి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఇంటర్న్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 18, 2025వ తేదీ లోపు సంబంధిత పోర్టల్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సాధారణ ఇంటర్న్‌షిప్‌లతోపాటు స్టైపెండ్‌ ఇచ్చే ఇంటర్న్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

దరఖాస్తు అనంతరం ఆయా విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మే 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్ధులకు.. ఇంటర్న్‌ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు స్టైఫండ్‌ కూడా ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచించింది.

ఉచిత ఇంటర్న్‌షిప్‌లకు ఇక్కడ క్లిక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

మే 17 నుంచి డిప్లొమా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా విద్యార్థులకు మే 17 నుంచి జూన్‌ 16 వరకు ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మే 16వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్న్‌షిప్‌ సమయంలో 40 గంటలపాటు తరగతి బోధన, 20 గంటల ప్రాక్టికల్స్, రోజుకు రెండు గంటల ఆన్‌లైన్‌ శిక్షణ ఉంటాయిని పేర్కొంది. పైథాన్, ఆటోక్యాడ్‌ తదితర కోర్సులపై ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించింది. డిప్లొమా మొదటి, రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ప్రతి ఒక్కరూ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 99888 53335, 87126 55686 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.